దాస‌రి కో డైరెక్ట‌ర్ ప్ర‌భాకర్ కుమార్తె కాలేజ్ ఫీజు కట్టిన‌ చిరు

దాస‌రి కో డైరెక్ట‌ర్ ప్ర‌భాకర్ కుమార్తె కాలేజ్ ఫీజు కట్టిన‌ చిరు

క‌రోనా కష్టకాలంలో సినీ ఇండస్ట్రీ  కార్మికులతో స‌హా ఆప‌ద‌లో ఉన్న ఎంద‌రినో మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి మెగాస్టార్ దాతృత్వాన్ని చాటుకున్నారు. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు కోడైరెక్ట‌ర్ (లంకేశ్వ‌రుడు సినిమాకు కో డైరెక్ట‌ర్) గా ప‌ని చేసిన ప్ర‌భాక‌ర్ కు కష్ట కాలంలో మెగాస్టార్ చిరంజీవి టీం ఆర్థిక సాయం అందించారు.  ప్రభాకర్ కూతురు చ‌దువుకు అవ‌స‌ర‌మైన ఫీజుల సాయం చేసి ఆదుకున్నారు.

తాను దాస‌రి దగ్గర కోడైరెక్ట‌ర్ గా ప‌ని చేశానని తెలిపారు ప్రభాకర్ . చిరంజీవి న‌టించిన లంకేశ్వ‌రుడికి కోడైరెక్ట‌ర్ గా చేశానని తెలిపారు. అయితే ఇటీవ‌ల `హెల్ప్ లైన్` అనే సినిమా తీసి..ద‌ర్శ‌క‌నిర్మాత‌గా చాలా న‌ష్ట‌పోయానని చెప్పాడు. ఆ సినిమాని ఎవ‌రూ రిలీజ్ చేయ‌క న‌ష్ట‌పోయానని అన్నారు. మా అబ్బాయికి సీబీఐటీలో ఇంజినీరింగ్ పూర్త‌యి రెండేళ్ల‌య్యింది. వాడి సర్టిఫికెట్లు డ‌బ్బు క‌ట్టి తేవాలి. పాప‌కు బీబీఏ ఫైన‌ల్ ఇయ‌ర్ కి వ‌చ్చింది. 2.5 ల‌క్ష‌ల ఫీజు క‌డితేనే ఎగ్జామ్ రాయ‌గ‌ల‌దు. ఎంత ప్ర‌య‌త్నించినా డ‌బ్బు ముట్ట‌లేదు. దీంతో సాయం కోసం  చిరంజీవిని అర్థించేందుకు క‌లిసినట్లు తెలిపారు. 30ఏళ్ల క్రితం లంకేశ్వ‌రుడికి ప‌ని చేసిన‌ప్పుడు ఎంత ప్రేమ‌గా చూసుకున్నారో ఇప్పుడు కూడా అదే ప్రేమ‌ను క‌న‌బ‌రిచారు. వెంట‌నే స్పందించి ఫీజు ఏర్పాటు చేశారని చెప్పారు.

చిరంజీవి గారు ఆదుకున్నారు అన‌గానే నా క‌ష్టం విని రామ్ చ‌ర‌ణ్ గారు వారి స్టాఫ్ కూడా అంతే సాయం చేశారని తెలిపారు ప్ర‌భాక‌ర్.